Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాయిదా తీర్మాణం కోరనున్న బీఆర్ఎస్
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ(BRS party) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) ఇరుకున పెట్టేందుకు సిద్దమైంది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ(BRS party) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) ఇరుకున పెట్టేందుకు సిద్దమైంది. అసెంబ్లీ సమావేశాల్లో(assembly sessions) బీఆర్ఎస్ పార్టీ తరుపున వాయిదా తీర్మాణం(adjournment resolution) ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో(Lagacharla) ఫార్మా పేరిట ప్రభుత్వ భూసేకరణను ప్రతిఘటించిన అమాయక గిరిజన రైతులపై ప్రభుత్వ నిర్భంధ కాండ- పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం.. నెల రోజులుగా రైతులను జైళ్లలో బంధించిన అంశంపై చర్చ చేయాలని పట్టు బట్టనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Siddipet MLA Harish Rao) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) కు వాయిదా తీర్మాణం నోటీసులు ఇచ్చారు. లగచర్ల ఘటనపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కాలేరు వెంకటేష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, విజయుడు, మర్రి రాజశేఖర్ రెడ్డి లు వాయిదా తీర్మాణం నోటీస్ పై సంతకం చేశారు. కాగా లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా రైతులను అరెస్ట్ చేశారు.