Telangana Assembly sessions : బిగ్ బ్రేకింగ్ : అసెంబ్లీ సమావేశాలకు KCR ఆదేశం
డిసెంబర్ ఫ్టస్ వీక్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. సెప్టెంబర్లో నిర్వహించిన 8వ సమావేశం 4వ విడత కొనసాగనున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో : డిసెంబర్ ఫ్టస్ వీక్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly sessions) ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. సెప్టెంబర్లో నిర్వహించిన 8వ సమావేశం 4వ విడత కొనసాగనున్నాయి. గత సమావేశాలను ప్రొరోగ్ చేయకపోవడంతో దానికి కంటిన్యూగా ఇవి కొనసాగనున్నాయి. దీంతో గవర్నర్ తమిళి సై ప్రసంగించే అవకాశం లేదు. సమావేశం ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే తెలంగాణ ఆదాయం తగ్గిందని, రాష్ట్రానికి రావల్సిన రూ.40వేల కోట్ల ఆదాయం తగ్గిందని, కేంద్ర ఆంక్షల వల్లే ఆదాయం తగ్గిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోనున్నారు.
అదే విధంగా ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అయితే ఆ ఏడు బిల్లుల్లో ములుగు అటవీ కళాశాల పేరును తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చడం, రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లోని కొలువుల భర్తీకి ఉమ్మడి బోర్డు ఏర్పాటు, ప్రైవేటు వర్సిటీల చట్టం, పురపాలికల చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం, మోటార్ వాహనాలపై పన్నులకు సంబంధించిన చట్టం సవరణ బిల్లులు ఉన్నాయి. ఈ బిల్లులను అసెంబ్లీలో మరోసారి చర్చించాలా? లేకుంటే కొత్త బిల్లులు ప్రవేశపెట్టాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సమావేశాలకు సంబంధించిన తేదీలను సైతం త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు.
Read more: