‘రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి’..అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల(Health cards) జారీకి నిబంధనలను సవరించాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-16 04:38 GMT
‘రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి’..అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్:కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల(Health cards) జారీకి నిబంధనలను సవరించాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 5.67 లక్షల నిరుపేద కుటుంబాలు అంత్యోదయ అన్న యోజన(Antyodaya Yojana) కార్డులను ఉపయోగించుకుంటున్నారని అసదుద్దీన్(Asaduddin) పేర్కొన్నారు. ఈ మేరకు రేషన్‌ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీకి ఆదివారం వినతి పత్రం సమర్పించారు. గ్రామాల్లో రూ.1.5లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలు గా ఉన్న ఆదాయ పరిమితి తో పాటు భూ పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని కోరారు. ఈ క్రమంలో దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, హస్త కళాకారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలన్నారు.

Tags:    

Similar News

Expand player