Pawan Kalyan : ఏపీ డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌కు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. మినట్ టు మినట్ అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు పవన్‌కు సూచించాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడు చెప్పలేమని ఏజెన్సీలు తెలిపాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు కాల్స్ ట్రాకింగ్ చేసినప్పుడు వారి మధ్య పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఆ అంశాల ఆధారంగా పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలను కేంద్ర నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి. అయితే ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అటూ కేంద్రంలోనూ ప్రధాని మోడీతో పవన్ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే జనసేన పార్టీ కానీ, పవన్ సన్నిహితులు ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.