బిగ్ న్యూస్: లోక్ సభతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..?

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది.

Update: 2023-04-03 14:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల విమర్శలపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఆలోచన చేస్తున్నారనే ప్రచారం గత కొంత కాలంగా వినిపిస్తోంది. ముందస్తుకు పోయేది లేదని ఇరు రాష్ట్రాల సీఎంలు మీదికి చెబుతున్నా.. బ్యాక్ ఎండ్‌లో ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, ఏపీ బీజేపీ నేత టీ.జీ వెంకటేశ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగినా జరగవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్నికలు షెడ్యూల్ కంటే వెనక్కి పోయినట్లే ఈ సారి ముందుకు కూడా పోవచ్చని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన టీజీ వెంకటేశ్.. అంతా కేసీఆర్ అనుకున్నట్లే జరగదని.. గతంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఢిల్లీ పెద్దలు ఎలక్షన్స్ నిర్వహించారు.

ఈసారి లోక్ సభతో పాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. రాజకీయాల్లో ఎవరి పంతాలు వారికి ఉంటాయి. అంతిమంగా ఢిల్లీ లీడర్సే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. టీ.జీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2018లో కేసీఆర్ ఎన్నికలకు వెళ్లడం వెనుక లోక్ సభతో పాటే ఎన్నికలు జరిగితే అది మోడీకి అడ్వాంటేజ్ అవుతుందని భావించే అసెంబ్లీని రద్దు చేసుకుని మందుస్తుకు వెళ్లారనే చర్చ జరిగింది.

ఈ సారి ముందస్తుకు వెళ్లకపోయినా షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఐదు నెలల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. సో ఈ సారి కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగడం వల్ల ప్రచార సమయంలో రాష్ట్ర సమస్యలపైనే డిబెట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతలో టీజీ వెంకటేశ్ చేసిన కామెంట్స్ చర్చనీయాశంగా మారాయి. అసలే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నిజంగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు లోక్ సభ ఎలక్షన్స్‌తో పాటే జరుగుతాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read..

అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగింపు 

Tags:    

Similar News