ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 275 బస్సుల కొనుగోలు

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇప్పటికే 80 బస్సులను ప్రారంభించిన సంస్థ, కొత్తగా మరో 275 బస్సులు కోనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

Update: 2024-01-10 12:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇప్పటికే 80 బస్సులను ప్రారంభించిన సంస్థ, కొత్తగా మరో 275 బస్సులు కోనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఏడాది జూలై చివరి వరకు 1,275 బస్సులను రోడ్డెక్కించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. ఆ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఊహించని విధంగా స్పందన వస్తుందని తెలిపారు. రాష్ట్రం అంతటా మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో బస్సులు‌పై పెరుగుతున్న భారాన్ని తగ్గించేందుకు కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశామని తెలిపారు.

Tags:    

Similar News