MLA రోహిత్ రెడ్డి ఈడీ నోటీసుల్లో ఊహించని ట్విస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ అందజేసిన నోటీసులు వెలుగులోకి వచ్చాయి. పీఎమ్‌ఎల్‌ఏ కింద రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. 2002లో ఈసీఐఆర్‌లో నమోదైన కేసుపై ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నది. ఈ నోటీసుల్లో ఈడీ పది అంశాలను కీలకంగా ప్రస్తావించింది. డిసెంబర్ 19న హైదరాబాద్‌లో ఈడీ ఎదుట హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ల వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. స్థిర, చర ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఈడీ నోటీసులపై రోహిత్ రెడ్డి కూడా ధృవీకరించారు. కాగా, బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఉన్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈడీ నోటీసులు స్వయంగా రోహిత్ రెడ్డికే రావడం చర్చనీయాంశంగా మారింది.