మరోసారి రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి.. రాహుల్ దగ్గర తేల్చుకుందాం అంటూ ఎంపీల సవాల్..!
కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఎంపిక తుది దశ మీటింగ్ హాట్ హాట్‌గా కొనసాగుతున్నది. ఢిల్లీ వార్ రూమ్‌లో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌లో టీపీసీసీ అధ్యక్షుడు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఎంపిక తుది దశ మీటింగ్ హాట్ హాట్‌గా కొనసాగుతున్నది. ఢిల్లీ వార్ రూమ్‌లో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సీనియర్లు పోటీ చేసే స్థానాలలో రేవంత్ రెడ్డి కొత్తగా మరో ఇద్దరి పేర్లు చేర్చడంపై ఎంపీ కోమటిరెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్లు ఎంపిక తుది దశలో కొత్త పేర్లు ఇవ్వడం ఏమిటని? కోమటిరెడ్డి ప్రశ్నించగా.. తాను రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నానని పార్టీ పరిస్థితులు కేడర్ పరిస్థితి తనకు తెలుసునని రేవంత్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
ఇదే అంశంలో మిగతా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కోమటిరెడ్డికి మద్దతుగా రేవంత్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరువురి నేతలు మధ్య కొద్ది నిమిషాల పాటు ఫైట్ కొనసాగింది. చివరికి టికెట్ల ఎంపిక అంశం రాహుల్ గాంధీ వద్దనే తేల్చుకుందామంటూ ఇద్దరు నేతలు సవాల్ విసురుకున్నారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీలోకి తాత్కాలికంగా రేవంత్ టీమ్‌కు చెందిన బలరాం నాయక్, షబ్బీర్ అలీ పేర్లు పెట్టినప్పటికీ.. ఢిల్లీలో జరుగుతున్న టికెట్ల ఫైనల్ మీటింగుకు ఆ ఇద్దరు నేతలను అనుమతించలేదు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది