Ambedkar University: రేపే అంబేద్కర్ యూనివర్సిటీ ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్.. స్పాట్ రిజిస్ట్రేషన్ కొరకు చాన్స్
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(BR Ambedkar University) ఎంబీఏ ఎంట్రెన్స్ పరీక్ష(MBA Entrance Exam) శనివారం నిర్వహించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(BR Ambedkar University) ఎంబీఏ ఎంట్రెన్స్ పరీక్ష(MBA Entrance Exam) శనివారం నిర్వహించనున్నారు. కాగా ఇప్పటివరకు ఆన్‌లైన్(Online)లో దరఖాస్తు చేసుకోని విద్యార్థులు హైదరాబాద్(HYD)లోని విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో స్పాట్ రిజిస్ట్రేషన్(Spot Registration) చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా నేరుగా పరీక్ష రాయొచ్చని స్పష్టంచేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన రిజిస్ట్రేషన్ ఫీజు, ఆధార్ కార్డ్(Aadhaar Card)తో పాటు రెండు ఫొటోలు(Two Photos) తీసుకొని రావాలని సూచించారు. ఎంట్రన్స్ పరీక్ష శనివారం మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఐ-సెట్ 2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందొచ్చని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్‌సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన
అంబేద్కర్ వర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి(JNAFAU) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్సిటీ జేఏసీ నల్లబ్యాడ్జీలతో శుక్రవారం నిరసన తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.