Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం అందజేత.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట (Stampede) ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ (Allu Arjun)తో పాటు నిర్మాతలు, డైరెక్టర్ ఇవాళ భారీ పరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు పుష్ప-2 హీరో అల్లు అర్జున్ (Allu Arjun) రూ.కోటి, డైరెక్టర్ సుకుమార్ (Sukumar) రూ.50 లక్షలు, చిత్ర నిర్మాతలు (మైత్రీ మూవీ మేకర్స్) రూ.50 లక్షలు కలిపి మొత్తం రూ.2 కోట్ల చెక్కులను ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజ్ (Dil Raju), అల్లు అరవింద్ (Allu Arjun) కలిసి కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital)లో రేవతి భర్తకు అందజేశారు. అనంతరం ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ (Sritej)ను అల్లు అరవింద్ (Allu Aravind) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీతేజ్ (Sritej) నెమ్మదిగా కోలుకుంటున్నాడని తెలిపారు. గత 72 గంటలుగా అతడు వెంటిలేటర్ లేకుండా చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. త్వరలోనే అతడు పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆశిస్తున్నానని అల్లు అరవింద్ అన్నారు.