Allu Arjun: అల్లు అర్జున్‌కు జైలా.. బెయిలా! జరిగేది అదేనా..?
సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ (Chikkadpally Police Station)కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అల్లు అర్జున్ (Allu Arjun)కు వైద్య పరీక్షల నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి ఆసుపత్రి (Osmania Hospital)కి తరలించారు. ఆ వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచున్నారు. కాగా, మరోవైపు చిక్కడపల్లి (Chikkadpally) పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలని తాజాగా అల్లు అర్జన్ (Allu Arjun) హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి (Justice Juvvadi Sridevi) బెంచ్ అల్లు అర్జున్ (Allu Arjun) దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై సాయంత్రం 4.30 కి విచారణ చేపట్టనుంది. అయితే, సోమవారం వరకు తనను కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అల్లు అర్జున్ తన క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ వైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై సాయంత్రం 4.30 కి విచారణ జరగనుండగా.. ఈ లోపే అల్లు అర్జున్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు కావడంతో అల్లు అర్జున్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయి. బెయిల్ పిటిషన్ వేయడానికి కూడా కోర్టులకు రెండు సెలవులు రావడంతో కోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తుందా.. రిమాండ్ విధిస్తుందా అనే టెన్షన్ అదరిలోనూ నెలకొంది.