Allu Arjun: అల్లు అర్జున్‌‌ పిటిషన్‌పై నేడు విచారణ.. రెగ్యూలర్ బెయిల్‌పై టెన్షన్.. టెన్షన్!

సంస్థ థియేటర్ తొక్కిసలాట (Company Theater Stampede) కేసుకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ (Regular Bail Petition)పై ఇవాళ మరోసారి నాంపల్లి కోర్టు (Nampally Court) విచారణ చేపట్టనుంది.

Update: 2024-12-30 04:33 GMT
Allu Arjun: అల్లు అర్జున్‌‌ పిటిషన్‌పై నేడు విచారణ.. రెగ్యూలర్ బెయిల్‌పై టెన్షన్.. టెన్షన్!
  • whatsapp icon

దిశ, వెబ్‌‌డెస్క్: సంస్థ థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede) కేసుకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ (Regular Bail Petition)పై ఇవాళ మరోసారి నాంపల్లి కోర్టు (Nampally Court) విచారణ చేపట్టనుంది. కాగా, గత విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు జడ్జిని సమయం కోరిన పోలీసులు నేడు కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. అయితే, హైకోర్ట్ (High Court) మధ్యంతర బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు (Nampally Court) 14 రోజుల పాటు రిమాండ్ (Remand) విధించింది. ప్రస్తుతం రిమాండ్ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ (Regular Bail) కోసం నాంపల్లి కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించింది. దీంతో అల్లు అర్జున్ (Allu Arjun) లీగల్ టీమ్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సోమవారానికి విచారణను వాయిదా వేసింది. నేడు ఆ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపడుతోన్న తరుణంలో అల్లు అర్జున్‌ (Allu Arjun)కు రెగ్యులర్ బెయిల్ వస్తుందా.. రాదా అనే టెన్షన్ అటు అభిమానుల్లో.. ఇటు సినీ ప్రముఖుల్లో ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News