Allu Arjun: చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ రెడీ!

సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు.

Update: 2024-12-13 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్/రాంనగర్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అల్లు అర్జున్‌ (Allu Arjun)ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రి (Osmania Hospital)కి తరలించనున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్టు (Remand Report)ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టేషన్ వద్దకు జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అల్లు అర్జున్ (Allu Arjun) వెంట పోలీస్ స్టేషన్‌కు తండ్రి అల్లు అరవింద్ (Allu Aravind), సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish), మామ శేఖర్ రెడ్డి (Shekar Reddy) వచ్చారు.      

Tags:    

Similar News