Allu Arjun: నటుడు అల్లు అర్జున్ అరెస్ట్.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిక్కడపల్లి (Chikkadpally) పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలని తాజాగా అల్లు అర్జన్ (Allu Arjun) హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి (Justice Juvvadi Sridevi) బెంచ్ అల్లు అర్జున్ (Allu Arjun) దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై సాయంత్రం 4.30 కి విచారణ చేపట్టనుంది. అయితే, సోమవారం వరకు తనను కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అల్లు అర్జున్ తన క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు.