మంత్రి వర్గంలో బంజారాలకు ప్రియార్టీ ఇవ్వరా?

రాష్ట్ర మంత్రి వర్గంలో బంజారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్ర నాయక్ డిమాండ్ చేశారు.

Update: 2024-09-29 16:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రి వర్గంలో బంజారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్ర నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ పరిధిలో ఉన్న గిరిజన విద్యుత్ భవన్ లో సంఘం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈసందర్భంగా రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. మంత్రివర్గంలో బంజారాలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 40 లక్షలకు పైగా జనాభా ఉన్న బంజారాలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం గోర్బోలి భాషకు అధికార హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేయాలన్నారు.

రాజ్యంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేయాలన్నారు. గోర్ భాషను రాజ్యాంగంలో చేర్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేయాలని రామచంద్ర నాయక్ పట్టుపట్టారు. ఈ అంశంపై ప్రధానిని, రాష్ట్రపతిని కలుస్తామని వారు తీర్మానం చేశారు. అలాగే గిరిజనులు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో అన్ని గిరిజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేట్ ప్రెసిడెంట్ మోహన్ సింగ్ నాయక్, నాయకులు పాండురంగ నాయక్, శ్యాం నాయక్, కిషన్ నాయక్, రాంబాబు నాయక్, కిషన్ సింగ్ రాథోడ్, తారాచంద్, బాబురావు నాయక్, దీప్ లాల్ చౌహాన్, శేఖర్ నాయక్, నారాయణ నాయక్, ఎల్ రాందాస్ నాయక్, హాము నాయక్, సీతారాం నాయక్, సుమన్ నాయక్ రాథోడ్, చంద్రు నాయక్, ప్రవీణ్ నాయక్, పరశురాం నాయక్, గోపీచంద్, అనిల్ నాయక్, ఆయా జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.


Similar News