Bhatti Vikramarka : అన్ని వసతిగృహ, హాస్టల్స్ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు జీవో విడుదల
రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు, పలు సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాల్లోని విద్యార్థులకు మేలు చేకూరేలా కాస్మోటిక్స్, డైట్ చార్జీలను పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు, పలు సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాల్లోని విద్యార్థులకు మేలు చేకూరేలా కాస్మోటిక్స్, డైట్ చార్జీలను పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పెంపుకు సంబంధించిన జీవోను ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విడుదల చేశారు. కాగా ప్రస్తుతం 3 నుంచి 7వ తరగతి వరకు ఉన్న డైట్ ఛార్జీలు రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలు రూ.1330కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు.. రూ.1100 నుంచి రూ.1540కి పెంచారు. ఇక ఇంటర్ నుండి పీజీ వరకు.. రూ.1500 నుంచి రూ.2100కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాస్మోటిక్ ఛార్జీలు 3 నుంచి 7వ తరగతి వరకు ప్రస్తుతం రూ.55 ఉండగా.. దానిని రూ.175కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ.275 వరకు పెంచారు. 40 శాతం పెరిగిన ఈ ఛార్జీల వలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ వివరాలకు సంబంధించిన జీవో కాపీని నేడు అధికారికంగా విడుదల చేశారు.