ALERT : నేడు, రేపు తెలంగాణలో వర్షాలు..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-05-18 01:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


Similar News