Allert: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. అడ్మిషన్ల గడుపు పెంపు

తెలంగాణలో ఇంటర్మిడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్ధులకు ఇంటర్ బోర్డు శుభవార్త తెలిపింది.

Update: 2024-08-20 10:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇంటర్మిడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్ధులకు ఇంటర్ బోర్డు శుభవార్త తెలిపింది. ఇంటర్మిడియట్ అడ్మిషన్ల గడువును పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది. తెలంగాణలోని గవర్నమెంట్, ప్రైవేట్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కళాశాలలో 2024-25 సంవత్సరానికి గాను ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువు ముగియడంతో ఇంటర్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును ఆగస్ట్ 31 వరకు పెంచింది. ఈ మేరకు తెలంగాణ బోర్ట్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు tgbie.cgg.gov.in వెబ్ సైట్ లో పేర్కొన్న అఫీలియేటెడ్ జూనియర్ కాలేజీల్లో మాత్రమే తీసుకోవాలని విద్యార్ధులు, తల్లిదండ్రులకు సూచించారు.

Tags:    

Similar News