Hyderabad Metro Rail : ప్రయాణికులకు అలర్ట్.మెట్రో రైలు టైమింగ్స్ చేంజ్

రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న హైదరాబాద్ మహానగరంలో కేవలం నామమాత్రపు చార్జీలకే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ వేళల్లో అధికారులు మార్పులు చేశారు.

Update: 2024-05-18 07:01 GMT
Hyderabad Metro Rail : ప్రయాణికులకు అలర్ట్.మెట్రో రైలు టైమింగ్స్ చేంజ్
  • whatsapp icon

దిశ, సిటీ బ్యూరో: రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న హైదరాబాద్ మహానగరంలో కేవలం నామమాత్రపు చార్జీలకే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం. పొడిగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి తెచ్చినట్లు మెట్రో అధికారులు తెలిపారు.

Tags:    

Similar News