రేపటి వివాహ ప్రాప్తి కార్యక్రమం క్యాన్సిల్.. చిలుకూరి బాలాజీ టెంపుల్ భక్తులకు అలర్ట్
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో రేపు జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దయింది.
దిశ, డైనమిక్ బ్యూరో:రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో రేపు జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దయింది. నిన్న గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందుల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అర్చకులు రంగరాజన్ తెలిపారు. పెళ్లి కావాల్సిన వాళ్లు ఇళ్లల్లో నుంచే దేవుడ్ని ప్రార్థించాలని సూచించారు. ఆలయంలో కల్యాణోత్సవం యథాతథంగా జరుగుతుందన్నారు. కాగా సంతానప్రాప్తి లేని మహిళలకు గరుడ ప్రసాద వితరణ చేస్తారని సమాజీకి మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడంతో నిన్న ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు చిలుకూరు బాలాజీ టెంపుల్ కు పోటెత్తారు. దీంతో ఆలయం వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. ఈ క్రమంలో స్వల్పతొక్కిసలాటకూడా జరింగింది. ప్రసాదం కేవలం 10 వేల మందికి సరిపోయేంత మాత్రమే ఉండగా ఉదయం 10 గంటలకే 70 వేల మందికి పైగా భక్తులు లైన్లో నిల్చున్నారు. దీంతో మరోసారి ప్రసాదం తయారు చేయించి మధ్యాహన్నం 12 గంటల వరకు సుమారుగా 35 వేల మందికి వితరణ చేశారు. సుమారు 1.50 లక్షల మందికిపైగా భక్తులు ప్రసాదం కోసం తరలి వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఊహించన దానికంటే ఎక్కువ మంది భక్తులు రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే రేపు వివాహా ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు.