Sridhar Babu: ఏఐ టెక్నాలజీ మిస్ యూజ్ కాకూడదు: శ్రీధర్ బాబు

తెలంగాణలో ఏఐ విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2024-09-05 06:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్స్ లో జరుగుతున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడిన ఆయన భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏటా గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తోందని, తెలంగాణ 11.3 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని తెలిపారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ కలిగి ఉందన్నారు. అత్యాధునిక వసతులతో ఏఐ సీటీ విర్మిస్తామని, రాబోయే మూడేళ్లలో ఏఐ గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ మారబోతున్నదన్నారు. ఏఐ పెట్టుబడులకు ఇండియా గమ్యస్థానంగా ఉందని చెప్పిన శ్రీధర్ బాబు.. తెలంగాణలో ఏఐ విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఏఐ సాంకేతికత దుర్వినియోగం కాకుండా చూడాల్సి ఉందన్నారు.


Similar News