12 ఏళ్ల తర్వాత.. రేపు కేసీఆర్ టీవీ డిబెట్!

రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు బీఆర్ఎస్ నుంచి వలసలు, అధికార పక్షం నుంచి తీవ్రమవుతున్న విమర్శల దాడి నేపథ్యంలో నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు.

Update: 2024-04-22 10:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు బీఆర్ఎస్ నుంచి వలసలు, అధికార పక్షం నుంచి తీవ్రమవుతున్న విమర్శల దాడి నేపథ్యంలో నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. దాదాపు 12 ఏళ్ల అనంతరం ఆయన మరోసారి టీవీ చర్చకు రాబోతున్నారు. ఎంపీ ఎన్నికల ముంగిట్లో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేపు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటవ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కరీంనగర్ వేదికగా జరిగిన కదనభేరీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే భూమి బద్దలైనట్లు కాంగ్రెస్ మాట్లాడుతోంది.. కాళేశ్వరం గురించి రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకు వచ్చి వివరిస్తానని కీలక ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత ఈ విషయంలో సైలెంట్ అయిపోయింది. తాజాగా రేపు ఓ ప్రముఖ ఛానెల్ లో ఇంటర్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 'రేపు, తెలుగులో మహోన్నతమైన రాజకీయ ప్రముఖుడితో అతిపెద్ద, ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉండండి. మాతో ఎవరు చేరుతున్నారో మీరు ఊహించగలరా?' అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యాష్ ట్యాగ్ లు ఇచ్చారు. దీంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కేసీఆర్ కొందరు జగన్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మెజార్టీ నెటిజన్లు మాత్రం ఇంటర్వ్యూకు రాబోయో గెస్ట్ కేసీఆరేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

12 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ:

ఈ ఇంటర్వ్యూకు వచ్చేది కేసీఆరే అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత కేసీఆర్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు అవుతుంది. 12 ఏళ్ల క్రితం మలి దశ ఉధ్యమంలో ఆయన చివరగా ఆయన టీవీ9 కు ఎక్సక్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పట్లో ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ అనంతరం సీఎంగా ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో పరిమామాలు సంతరించుకున్నారు. ఈ క్రమంలో తిరిగి అదే చానెల్ ద్వారా ప్రజల వద్దకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ వైపు ఏపిల్ 24 నుంచి బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న కేసీఆర్ అంతకంటే ఒకరోజు ముందు టీవీ ఇంటర్వ్యూకు వస్తుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. త్వరలో ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారని ఇప్పటికే ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ వైపు కాంగ్రెస్, బీజేపీ దూకుడు, మరో వైపు బీఆర్ఎస్ లో వలసలు, కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం వంటి ముఖ్యమైన ఇష్యూస్ లో వీటిపై కేసీఆర్ ఎలా రియాక్ట్ కాబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వీవర్స్ కాల్స్ ను సైతం స్వీకరించారు. ఉద్యమ నాయకుడిగా వారడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో జవాబులిచ్చారు. మరి పదేళ్ల పరిపాలన తర్వాత ఇస్తున్న ఇంటర్వ్యూ కావడంతో గతంలో మాదిరిగా ప్రజల నుంచి ఫోన్ కాల్స్ స్వీకరిస్తారా? నాటి తన వాగ్ధాటిలో నాటి ఫైర్ ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News