మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై తీర్పు వాయిదా.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంలో తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్

Update: 2023-10-09 06:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంలో తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో పూర్తి ఆస్తుల వివరాలు వెల్లడించలేదని, అసమగ్రంగా సమర్పించారని, ఆ తర్వాత పోలింగ్ అధికారుల సహకారంతో అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారని రాఘవేంద్ర రాజు అప్పట్లో దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌పై దాదాపు నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న విచారణ దాదాపుగా కొలిక్కి వచ్చింది.

అడ్వకేట్ కమిషనర్‌ను నియమించిన హైకోర్టు.. అప్పుడు ఎన్నికల విధుల్లో ఉన్న రిటర్నింగ్ అధికారులు(ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్) 16 మంది నుంచి వివరణలు, సాక్ష్యాధారాలను సేకరించి హైకోర్టుకు నాలుగు రోజుల క్రితం సమర్పించింది. జస్టిస్ ఎం. లక్ష్మణ్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ అక్టోబర్ 9న తుది తీర్పును వెలువరించనున్నట్లు గత విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఆ ప్రకారమే సోమవారం ఈ పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ ఒక రోజు వాయిదా వేసిన బెంచ్.. మంగళవారం ఆర్డర్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News