ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నాం.. జోగు రామన్న

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్ష పాత్రను ప్రజలతో మమేకమై ధైర్యంగా నిర్వహిస్తామని.

Update: 2023-12-06 09:36 GMT

దిశ, ఆదిలాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్ష పాత్రను ప్రజలతో మమేకమై ధైర్యంగా నిర్వహిస్తామని. కార్యకర్తలతో కలిసి ముందుకు పోతామని మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఓటమి అనంతరం కార్యకర్తల నిరుత్సాహాన్ని దూరం చేస్తూ బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటూ, వారి ఋణం తీర్చుకుంటానని తెలిపారు. స్థానికంగా గెలిచిన అభ్యర్థికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టకుండా, తాను స్వతహాగా తెచ్చినటువంటి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టి వారి అవునత్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే వారి అసమర్ధపాలనకు నిదర్శనంగా నిలుస్తుందని ఎద్దేవ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో చేయనటువంటి సంక్షేమాలు సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు.

దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించగలిగామని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు అరికట్టే విధంగా రైతుబంధు కార్యక్రమాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్ దేనని, రైతు బీమా రైతు కుటుంబానికి అండగా నిలిచిందన్నాని గుర్తు చేశారు. కేవలం 9 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సాధ్యం కాదన్నారు. కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అండగా నిలుస్తూ జనాలకు సేవలు అందిస్తూ, ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటూ ప్రజలకు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చిల్లర రాజకీయాకులకు తావివ్వలేదని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ప్రజానీకానికి అన్యాయం చేసే కార్యాచరణ పెడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాతీర్పును పూర్తిగా మేము గౌరవిస్తున్నాం అని.. ఇకముందు వారితోనే కలిసి నడుస్తామని అన్నారు. ఇందులో వైస్ చైర్మన్ జెహిర్ రంజాని, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News