మందమర్రి ఏజెన్సీ ఎత్తివేత చర్య ఎమ్మెల్యేకు తగదు...

మందమర్రి ఏజెన్సీ ఎత్తివేత చర్య చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు తగదని ఆదివాసి నాయక్ పాడు సేవా సంఘం, తుడుం దెబ్బ నాయకులు గంట సత్యం, భీం సేన్, పెద్ది లక్ష్మణ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-04-27 13:01 GMT

దిశ, మందమర్రి : మందమర్రి ఏజెన్సీ ఎత్తివేత చర్య చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు తగదని ఆదివాసి నాయక్ పాడు సేవా సంఘం, తుడుం దెబ్బ నాయకులు గంట సత్యం, భీం సేన్, పెద్ది లక్ష్మణ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఊరు మందమర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడిన ఆదివాసీలను అభివృద్ధి పరచడానికి కృషి చేయవలసిన చెన్నూరు ఎమ్మెల్యే సుమన్ కు మందమర్రి ఏజెన్సీ రద్దు కొరకు చెన్నూరు ఆత్మీయ సభలో ఆదేశాలు జారీ చేయడం తగదని హితవు పలికారు.

ఊరు మందమర్రి, నార్లాపూర్, ఊరు రామకృష్ణాపూర్ లను కలిపి ప్రత్యేక మేజర్ గ్రామపంచాయతీగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వలు పగ్గాలు చేపట్టినప్పటికీ ఆదివాసీ నాయక్ పోడు, తుడుం దెబ్బ గిరిజనులకు చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఆదివాసి గుడారాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నాయని వివరించారు. చెన్నూరు సభలో అన్న మాటను ఎమ్మెల్యే బాల్కసుమన్ వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఆదివాసి, నాయక్ పోడు గిరిజనులు రాష్ట్రవ్యాప్త ఉద్యమ బాట పట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనేని ప్రదీప్, బైరినేని పోషమల్లు, కొలకాని చంద్రయ్య, పెద్ది భార్గవ్, రెడ్డి రాకేష్, పెద్ది వివేక్, పెద్ది రాజన్న, సీనేని మల్లేష్, సేదు లక్ష్మణ్, హరీష్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News