అక్రమంగా తరలిస్తున్న ఆవులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం చింతలమానేపల్లి మండలం గూడెం బ్రిడ్జ్ వద్ద టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

Update: 2024-06-18 11:03 GMT

దిశ, చింతలమానేపల్లి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం చింతలమానేపల్లి మండలం గూడెం బ్రిడ్జ్ వద్ద టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తణిఖీలలో మహారాష్ట్ర నుండి కాగజ్‌నగర్‌ కు వస్తున్న ఒక మిని అశోక్ లేలాండ్ వాహనమును (TS 02UD6881) తనిఖీ చేయగా అందులో పది ఆవులు ఉన్నాయి. సరైన పత్రాలు లేని కారణంగా ఆ వాహనాన్ని, పది ఆవులను చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సీఐ రాణా ప్రతాప్ తెలిపారు.

మధ్యప్రదేశ్ లోని షెమ్రోల్ గ్రామానికి చెందిన డ్రైవర్ నిరంజన్ శర్మ, క్లీనర్ మదన్ సాకేత్ లను సీఐ విచారించగా బెజ్జూర్‌ మండలం కుకుడ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ వద్ద తాము పని చేస్తున్నామని తెలిపారు. అతని సూచనల మేరకే ఈ ఆవులను తరలిస్తున్నట్లు వివరించారు‌. దీంతో వ్యాన్ ను సీజ్ చేసి, ఇద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగించామని, యజమాని ఇర్ఫాన్ ప్రస్తుతం ‌పరారిలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ వెల్లడించారు. ఈ టాస్క్ లో ఎస్ఐ వేంకటేశ్, పోలీస్ కానిస్టేబుల్ మధు, రమేష్, సంజీవ్ ఉన్నారు.


Similar News