బాల్యవివాహం చేస్తే కఠిన చర్యలు
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఎల్వీ గ్రామంలో సంబంధిత అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.
దిశ,భైంసా : నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఎల్వీ గ్రామంలో సంబంధిత అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. పోలీసులు, ఐసీడీఎస్, రెవెన్యూ సిబ్బంది కలిసి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి పెండ్లిని అడ్డుకొని స్థానిక విద్యార్థినిని ఐసీడీఎస్ సిబ్బందికి అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీఓ అబ్దుల్ సమాద్, ఎస్సై డి.రమేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అనిత, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశ వర్కర్ తదితరులు ఉన్నారు.