ఇంకా సిగ్గు రాలేదా హరీష్… టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి

ఉపాధ్యాయుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2024-03-08 14:11 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్: ఉపాధ్యాయుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏసీ గదుల్లో కూర్చున్నవారికి జీతాలు ఇస్తారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉపాధ్యాయుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో హరీష్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కర్రు కాల్చి వాతలు పెట్టిన హరీష్ రావుకు సిగ్గు రాలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పట్టిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, దశరథ్ రాజేశ్వర్, వై సాయన్న, రవికుమార్ పాల్గొన్నారు.


Similar News