ఉదయం జైలు నుండి ఖైదీ పరార్.. రాత్రి అక్కడ అడ్డంగా బుక్

దిశ, తాండూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్ జైలు నుండి సో

Update: 2022-04-11 17:29 GMT
ఉదయం జైలు నుండి ఖైదీ పరార్.. రాత్రి అక్కడ అడ్డంగా బుక్
  • whatsapp icon

దిశ, తాండూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్ జైలు నుండి సోమవారం రాజేష్ అనే ఖైదీ తప్పించుకొని పారిపోవడంతో జైలు అధికారులు, సిబ్బంది ఉలిక్కి పడ్డారు. ఆసిఫాబాద్ మండలం రౌట సంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మెంగుబాయి గూడ గ్రామానికి చెందిన రాజేష్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు. జైలు ఆవరణలో ఉదయం పిచ్చిమొక్కలు తొలగిస్తుండగా రాజేష్ జైలు సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రెబ్బెన మండలం కొండపల్లి ప్రాంతంలో ఖైదీని పట్టుకొని జైలుకు తరలించారు. ఎట్టకేలకు ఖైదీ దొరకడంతో జైలు అధికారులు, సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News