Collector Rajarshi Shah : ఈనెల ఐదున ప్రజావాణి కార్యక్రమం రద్దు
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమం ఐదు రోజుల పాటు నిర్వహించనున్న సందర్భంగా వచ్చే సోమవారం 5వ తేదీన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు.
దిశ, ఆదిలాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమం ఐదు రోజుల పాటు నిర్వహించనున్న సందర్భంగా వచ్చే సోమవారం 5వ తేదీన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన అధికారులకు వెల్లడించారు. ఇందులో భాగంగా స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో సంబంధిత అధికారులుకు ప్రత్యేక అధికారులుగా విధులు కేటాయించడం జరిగిందని,అందుకు రాబోయే సోమవారం ప్రజావాణి ఉండదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టరేట్ కు రాకూడదని కోరారు.