Pranahita river : ప్రాణహిత నది ఉగ్రరూపం.. పరేషాన్ లో వరద గ్రామాల ప్రజలు..
ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చడంతో పరేషాన్ లో వరద గ్రామాల ప్రజలు ఉన్నారు.
దిశ, బెజ్జూర్ : ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చడంతో పరేషాన్ లో వరద గ్రామాల ప్రజలు ఉన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి పరవళ్ళు తొక్కుతుంది. దీంతో బెజ్జూర్ మండలంలోని మొగవెల్లి సోమిని, తలయి, భీమారం తిక్కపల్లి గ్రామాలు చుట్టూ వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా గ్రామాల్లో వరద నీరు చేరడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మండలంలోని పాపన్నపేట భీమారం గ్రామ సమీపంలో రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. ప్రాణహిత నది వరద నీరు పెరుగుతుందని ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో బెజ్జూరు మండలానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రాణహిత పరిసర ప్రాంతాల్లో వరద నీరు చేరి పంటలు నీటమునిగాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద గ్రామాల పై అధికారులు కన్నెత్తి చూడలేదని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహిత వర్గ గ్రామాల్లో పంటలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రాణహిత వరద గ్రామాల ప్రజలను ఆదుకోవాలని బెజ్జూర్ మండల కోరుతున్నారు.