MP Soyam Bapu Rao: రాష్ట్రం అభివృద్ధి కేంద్రం నిధులతోనే ..

గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా బోథ్ మండలంలోని ఘన్ పూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పర్యటించారు.

Update: 2023-06-22 12:48 GMT
MP Soyam Bapu Rao: రాష్ట్రం అభివృద్ధి కేంద్రం నిధులతోనే ..
  • whatsapp icon

దిశ, బోథ్ : గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా బోథ్ మండలంలోని ఘన్ పూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం సుభిక్షంగా వెలసిల్లింది అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలకు ఎగిసింది నా దేశం అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనను ఆయన ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలిసేలా చేయడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం వారికి ఆరోగ్యపరమైన అవసరాల కోసం మెరుగైన వైద్యం వారికి అందాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్య బీమా పథకాలు అందించాలని అన్నారు.

కార్మికులకు వ్యవసాయదారులకు మధ్యతరగతి కుటుంబాల వారి కోసం ప్రత్యేక పథకాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఫసల్ బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. దళితులను దళిత బంధు పేరుతో, గిరిజనులను గిరిజన బంధు పేరుతో, పోడు భూములకు పట్టాలిస్తామని, గిరిజనలను రుణమాఫీ అని రైతులను మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అందిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలోని ఏ వర్గాన్ని వదలకుండా అందరిని మోసం చేశారని అన్నారు. ఎన్నికలకు ముందు బీసీలను మోసం చేసేందుకు బీసీలకు లక్ష రూపాయల సబ్సిడీ లోను ప్రవేశపెట్టారు. దానికి 100 కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తున్నారని అన్నారు. అంతలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఎన్నికల కోడ్ వస్తుంది అన్ని పథకాలు ఆగిపోతాయి ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకు ఇదొక సాధనంగా మారుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జీవి రమణ, వెండి సోమేశ్వర్, జాదవ్ గోపాల్, సోలంకి శ్రీకాంత్, లవకుష్, గంగాధర్ గ్రామ యువత ప్రజలు పాల్గొన్నారు.

Also Read..

కొల్లూరులో డబుల్ ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ 

Tags:    

Similar News