కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాయల...
ఆదిలాబాద్ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ బుధవారం మొదటిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ బుధవారం మొదటిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన ఎమ్మెల్యే పాయల శంకర్ ను కేంద్ర మంత్రి శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఒక చరిత్ర సృష్టించారని, దీన్ని అలాగే కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ, వారికి సంక్షేమ ఫలాలను అందిస్తూ ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచాలని మంత్రి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ అధిష్టాన ఆదేశానుసారం ప్రజాసేవకు అంకితమై, నిస్వార్ధంగా వారి ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడతానని, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.