ఆదివాసుల మీద మావోయిస్టుల అప్రకటిత యుద్ధం అంటూ పోస్టర్లు కలకలం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కరవెల్లి గ్రామంలో ఆదివాసీ యువజన రాష్ట్ర సంఘా నాయకులు మావోయిస్టులకు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి పోస్టర్లు విడుదల చేశారు.

దిశ,చింతలమానేపల్లి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కరవెల్లి గ్రామంలో ఆదివాసీ యువజన రాష్ట్ర సంఘా నాయకులు మావోయిస్టులకు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి పోస్టర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్ లో "ఆదివాసుల మీద మావోయిస్టుల అప్రకటిత యుద్ధం..! కర్రె గుట్టల్లో మందుపాతరలు మావోయిస్టులారా..తీరవా మీ రక్త దాహాలు.అడవుల్లో బాంబులు..ఆదివాసుల గుండెల్లో గుబులు.. మావోయిస్టులారా.. సిగ్గు సిగ్గు" అనే పేరు తో పోస్టర్ లో పేర్కొన్నారు. ఈ పోస్టర్ లు ఆదివాసి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు విడుదల చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ పోస్టర్ లపై ఎస్ఐ నరేష్ ను వివరణ కోరగా ...మండలం లో రవీంద్ర నగర్, కరవెల్లి గ్రామాలలో ఆదివాసి యువజన సంఘం, తెలంగాణ రాష్ట్రం నాయకులు విడుదల చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. అడవిలో మావోయిస్టులు బాంబులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆదివాసి లు అడవిపై జీవన ఆధారం చేసుకొని బ్రతుకుతున్న తరుణంలో.. మావోయిస్టులు అడవిలో పోలీసుల కోసం అమర్చిన బాంబులకు ఆదివాసి జనాలు బలి అవుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నీచకరమైన చర్యలు చేపట్టొద్దని మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి సంఘాలు పోస్టర్లు విడుదల చేసినట్లు తెలుస్తుందన్నారు. దీనిపై విచారణ చేపడుతున్నామన్నారు.