తల్లిదండ్రులు నిరక్ష్యరాసులు.. కొడుకుకు కోటి రూపాయల ఉద్యోగం
తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, వాళ్లు చదువుకోకపోయినా పిల్లలని కష్టపడి చదివించారు. వారి కష్టానికి తగిన ఫలం దక్కింది.
దిశ, ఆదిలాబాద్ బ్యూరో: తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, వాళ్లు చదువుకోకపోయినా పిల్లలని కష్టపడి చదివించారు. వారి కష్టానికి తగిన ఫలం దక్కింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గుడి పేట కు చెందిన మాలోతు తిరుపతి (28) ఏడాదికి రూ. కోటి జీతంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో PHD పట్టా పొందారు. దీంతో బుధవారం థర్డ్ వేవ్స్ సిస్టమ్ రీసెర్చ్ మేనేజర్ గా ఏడాదికి రూ.కోటి జీతంతో ఉద్యోగం లభించింది. తిరుపతి తల్లిదండ్రులు రాంచందర్, శకుంతల నిరక్షరాస్యులు. వ్యవసాయం చేస్తూ వారి ఇద్దరు కుమారులను చదివించారు. తమ కుమారుడు గొప్పగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.