లోకల్ క్యాండేట్లకే టికెట్ ఇవ్వాలి...

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెటు స్థానికులకే ఇవ్వాలని ఆపార్టీ నియోజకవర్గ ఇంచార్జి చిలుమల శంకర్, నియోజకవర్గ ప్రతినిధి నాతరి స్వామి, మహిళా కాంగ్రెస్ రాష్ట్రకార్యదర్శి రోడ్డ శారద అన్నారు.

Update: 2023-05-30 16:53 GMT

దిశ, బెల్లంపల్లి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెటు స్థానికులకే ఇవ్వాలని ఆపార్టీ నియోజకవర్గ ఇంచార్జి చిలుమల శంకర్, నియోజకవర్గ ప్రతినిధి నాతరి స్వామి, మహిళా కాంగ్రెస్ రాష్ట్రకార్యదర్శి రోడ్డ శారద అన్నారు. అధిష్టానం చిరకాలంగా కాంగ్రెస్ పార్టీకి స్థానిక లీడర్లు అందిస్తున్న సేవలను, పనితీరును పరిగణంలోకి తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని తెలిపారు. స్థానికేతరులకు డబ్బుసూట్ కేసులతో వచ్చే నాయకులకు టికెట్ ఇస్తే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని వారు తెలిపారు. అధికార పార్టీ దాస్టికాలకు వ్యతిరేకంగా ప్రజల సమస్యల పై నిరంతరం స్థానిక నాయకులు ప్రజలపక్షాన నిలబడి పోరాడుతున్నారని తెలిపారు. పదవి కాంక్షతో డబ్బు సంచులతో వచ్చే నాయకులు స్థానికంగా అందుబాటులో ఉండరనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందన్నారు.

అంతేకాకుండా అంగబలం అర్ధబలం చూసి అధిష్టానం టికెట్ ఇస్తే బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడక తప్పదని తెలిపారు. స్థానికేతరులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు తీవ్ర విఘాతం కలుగుతుందని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు స్థానికులకే టికెట్టు ఇచ్చే విధంగా అధిష్టానాన్ని ఒప్పించాలని కోరారు. స్థానికేతరులకు పార్టీ టికెట్ ఇస్తే బెల్లంపల్లి నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయవకాశాన్ని జారవిడుసుకున్న వాళ్ళమౌతామన్నారు. బెల్లంపల్లి నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంలో అధిష్టానం స్థానికతను పరిగణంలోకి తీసుకోవాలని కోరారు. బెల్లంపల్లి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ఐదుగురులో ఎవరికీ పార్టీ టికెట్ ఖరారు చేసినా వారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకట శ్రీనివాస్, ఓబీసీ జిల్లా నాయకుడు బండిప్రభాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు ముడిమడుగుల మహేందర్, సీనియర్ నాయకుడు వేములకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News