వేతనాల పంపిణీలో అక్రమాలు..
లోకేశ్వర్ మండలంలోని రాజురా మసీదులో పనిచేస్తున్న ఇమామ్, మౌజన్ ల 30 నెలల వేతనాలు దాదాపు రూపాయలు మూడు లక్షలు స్వాహా చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ ఆ గ్రామ సర్పంచ్ ముత్తా గౌడ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
దిశ, లోకేశ్వరం : లోకేశ్వర్ మండలంలోని రాజురా మసీదులో పనిచేస్తున్న ఇమామ్, మౌజన్ ల 30 నెలల వేతనాలు దాదాపు రూపాయలు మూడు లక్షలు స్వాహా చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ ఆ గ్రామ సర్పంచ్ ముత్తా గౌడ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రప్రభుత్వం మసీదులలో పనిచేసే ఇమామ్, మౌజన్ లకు ఒక్కొక్కరికి నెలకు ఐదువేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా 2017 సంవత్సరం వరకు నెలనెలా సక్రమంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసిన మైనార్టీ వక్ఫ్ బోర్డ్, మైనార్టీ వెల్ఫేర్ శాఖల అధికారులు 2018 సంవత్సరం నుండి అడపా దడపా వారి ఖాతాల్లో వేతనాలు జమచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
అక్రమాల పై ఆధారాలతో సహాఫిర్యాదు..
అనుమానం వచ్చిన మసీదు కమిటీ సభ్యులు నిబంధనల ప్రకారం మసీదు కమిటీ బ్యాంకు ఖాతాను పరిశీలించగా వేతనాలు జమచేయడంలో మోసం జరిగినట్లు గుర్తించారు. దీనితో సోమవారం ఆధారాలతో సహా జిల్లాకలెక్టర్ కు, మైనార్టీ అధికారికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు విచారణ జరిపించాలని సీఈవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ ఉపాధ్యక్షులు ఎండీ జావిద్, సభ్యులు అలీం, యాసిన్, యూసుఫ్, బాబు, పాషా తదితరులు పాల్గొన్నారు.