పాఠకులకు సదుపాయాలు కల్పించాలి

గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు అన్ని సదుపాయాలు కల్పించాలని గ్రంథాలయం శాఖ కార్యదర్శి సరిత అన్నారు.

Update: 2025-03-27 14:45 GMT
పాఠకులకు సదుపాయాలు కల్పించాలి
  • whatsapp icon

దిశ, తాండూర్ : గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు అన్ని సదుపాయాలు కల్పించాలని గ్రంథాలయం శాఖ కార్యదర్శి సరిత అన్నారు. తాండూర్ గ్రంథాలయాన్ని గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రంథాలయం పరిసరాలు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయంలో సరిపడ ఫ్యాన్స్, లైట్స్ ఏర్పాటు చేయాలని లైబ్రేరియన్ రామారావుకు ఆమె సూచించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువతకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భండాగారాలని, అందరూ సద్వినియం చేసుకోవాలని ఆమె కోరారు. ఆమె వెంట రిటైర్ గ్రంథాలయ అధికారి గజ్జల రమేష్ స్వీపర్ స్వామి ఉన్నారు.

Similar News