కుటుంబ కలహాలతో ఉరేసుకుని నవవధువు బలవన్మరణం

కుటుంబ కలహాలతో ఉరేసుకుని నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.

Update: 2023-04-17 16:09 GMT

దిశ, బెల్లంపల్లి: కుటుంబ కలహాలతో ఉరేసుకుని నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కన్నాల బస్తికి చెందిన అపరాధ ప్రవళిక (26), భర్త సతీష్ తో గొడవ పడి క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి ఉరేసుకు ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దపెల్లి జిల్లా ఎయిట్ఇంక్లైన్ కు చెందిన ప్రవళికతో పది నెలల క్రితం సతీష్ తో వివాహమైంది.

ఈ క్రమంలోనే భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉండేవి. ప్రధానంగా సతీష్ తరపున బంధువులు ఇంటికి వచ్చే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. అంతే కాకుండా ప్రవళిక ఆత్మహత్య వెనుక వరకట్న వేధింపులు కూడా ఉన్నట్లు మృతురాలి బంధువులు అనుమాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Tags:    

Similar News