హోమియో వైద్యశాలకు వైద్యుడు కరువు..

మండలంలోని పొన్కల్ గ్రామంలోని హోమియో వైద్యశాలకు వైద్యుడు

Update: 2024-09-27 09:36 GMT

దిశ,మామడ : మండలంలోని పొన్కల్ గ్రామంలోని హోమియో వైద్యశాలకు వైద్యుడు కరువయ్యాడు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు హోమియో వైద్యం అందించాలని గత 38 సంవత్సరాల క్రితం వైద్యశాలను నెలకొల్పిన వైద్యులు, కాంపౌండర్ లేక ప్రజలకు వైద్యం అందక ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామంలో 1986 సంవత్సరంలో హోమియో వైద్యశాలను ప్రారంభించారు.ప్రజలకు హోమియో వైద్యం అందించారు. ఇక్కడ పనిచేసిన వైద్యులు బదిలీపై వెళ్లడం తో కొన్ని సంవత్సరాలు నుంచి వైద్యుడు, కాంపౌండర్ లేక వైద్యశాలకు తాళం వేసే ఉంటుంది. ఈ వైద్యశాలకు అటెండర్ ఉన్న ఆమె అంగవైకల్యంతో రావడం లేదని తెలుస్తుంది.

ఈ వైద్యశాలలో మందులున్న మనుషులు మాత్రం కంటికి కనిపించడం లేదు. హోమియో మందులు అన్ని వ్యాధులకు మంచిగా పని చేస్తాయని ఇక్కడ ప్రజల అపార నమ్మకం.గతంలో చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఈ వైద్యశాలకు వచ్చి చికిత్సలు చేయించుకునేవారు. ప్రతి సంవత్సరం లక్షల విలువచేసే మందులు వైద్యశాలకు వస్తున్న అవి మూలన పడి మూలుగుతున్నాయి. కొందరు హోమియో వైద్యం కోసం నిర్మల్ కు వెళ్లే దుస్థితి ఏర్పడుతుంది. ఇంటి వెనుక ఉన్న చెట్లు మందులకు పనికిరాదు అన్న సామెత అక్షరాల సత్యమవుతున్నాయి.ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వైద్యశాలకు వైద్యాధికారి, కాంపౌండర్ పోస్టులను నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News