లిక్కర్ స్కాంతో తెలంగాణకు తలవంపు.. ఎమ్మెల్సీ కవితపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్

Update: 2023-03-27 14:59 GMT

దిశ, తాండూర్: ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సమాజానికి తలవంపు తెచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రెబ్బెన మండల కేంద్రంలో పీపుల్స్ మార్చ్ శిబిరం వద్ద సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిని ఊడ్చివేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి ఇవ్వాల్సిన బొగ్గు గనుల కాంట్రాక్టులను, తెలంగాణ వనరులు, సంపదలను సీఎం కేసీఆర్ ఆంధ్ర బడాబాబులకు, కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేస్తూ.. దోచి పెడుతున్నాడని విమర్శించారు.

బొగ్గు గనులలో స్థానికులకు ఒక శాతం కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం సరికాదని, 80 శాతం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని మిషన్ భగీరథ, కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, పీసీసీ సభ్యులు గణేష్ రాథోడ్, సరస్వతి, నాయకులు కృష్ణారెడ్డి, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News