Bird Flu Effect : బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ మార్కెట్లు బంద్

రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ(Bird Flu) నేపథ్యంలో చికెన్ ప్రియులకు మరిన్ని కష్టాలు రానున్నాయి.

Update: 2025-02-21 05:01 GMT
Bird Flu Effect : బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ మార్కెట్లు బంద్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ(Bird Flu) నేపథ్యంలో చికెన్ ప్రియులకు మరిన్ని కష్టాలు రానున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాధితో భారీ సంఖ్యలో కోళ్ళు చనిపోతుండటం.. ఆ వార్తలు విపరీతంగా ప్రచారం అవడంతో ప్రజలు భయపడి చికెన్, గుడ్లు కొనడం మానేశారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో చికెన్ కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. అనేక చోట్ల గిరాకీలు లేక మాంసం దుకాణాలు వెలవెల బోతున్నాయి. ఈ క్రమంలో చికెన్ మార్కెట్ల యజమానులు కొద్దిరోజులు మార్కెట్లు బందు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదిలాబాద్ లోని చికెన్ మార్కెట్ల(Adilabad Chiken Markets) యజమానులు వారం రోజులపాటు మార్కెట్ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే వైద్యాధికారులు మాత్రం చికెన్ బాగా ఉడికించిన తర్వాత తింటే ఏమీ కాదని, భయపడాల్సిన పని లేదని అంటున్నారు. ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సాగిన కరొన మృత్యుహేలను దృష్టిలో ఉంచుకొని.. వ్యాధుల పట్ల ప్రజలు ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు మటన్ కొనడానికి ఆసక్తి చూపిస్తుండగా.. మార్కెట్లో మటన్ ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. కేజీ మటన్ ధర రూ. 1000 పలుకుతుండటంతో కొనడానికే ప్రజలు జంకుతున్నారు.   

Tags:    

Similar News