పొన్కల్ మండలం కోసం మరో ఉద్యమం ..?
మామడ మండలంలోనే పొన్కల్ అతిపెద్ద గ్రామం. మండలానికి
దిశ, మామడ : మామడ. మండలంలోనే పొన్కల్ అతిపెద్ద గ్రామం. మండలానికి అవసరమయ్యే అన్ని మౌలిక వసతులు ఉన్నాయి . 10 గ్రామల ప్రజలు కలిసికట్టుగా ఉండి గతంలో 46 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు .మహిళలు రాజకీయ నాయకులు, యువకులు, రైతులు ,చిన్నారులు సైతం మామడలో నిర్వహించిన వంటావార్పు తో నాయకుల గుండెల్లో వణుకు పుట్టి మండల ఏర్పాటు కోసం కృషి చేస్తామని చెప్పారు . ఎన్నికల నోటిఫికేషన్ ముందు హడావిడిగా మండలం కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్ గత ప్రభుత్వం విడుదల చేసి గాలికి వదిలేసింది.
ఈ ప్రజా పాలన ప్రభుత్వంలోనైనా మండలం ఏర్పడుతుందని పది గ్రామాల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. లేనియెడల మండల సాధన కమిటీ సభ్యులు మళ్లీ ఉద్యమం చేయడానికి 10 గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసి సంవత్సరం గడుస్తున్న నిరీక్షణగానే మిగిలింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో నూతన మండలాలను ప్రకటించడంతో పొన్కల్ మండలాన్ని ప్రకటిస్తారని ఆశలు చిగురిస్తున్నాయి .ఏది ఏమైనా పొన్కల్ ను మండలం గా ప్రకటించకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామంటున్నారు.