పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
మండలంలోని వెల్గనూరు గ్రామానికి చెందిన గడి కొప్పుల మహేందర్ 27 అనే యువకుడు అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దిశ, (దండేపల్లి): మండలంలోని వెల్గనూరు గ్రామానికి చెందిన గడి కొప్పుల మహేందర్ 27 అనే యువకుడు అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దండేపల్లి ఇన్చార్జి ఎస్ఐ. పాల్ తెలిపారు. మహేందర్‌కు నస్పూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి జరిగింది. కాగా వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గత ఏడాది నుంచి ఇద్దరికి మనస్పర్థలు రావడంతో గొడవలకు దారి తీసింది. దీంతో మహేందర్ అతని కుటుంబ సభ్యుల పై దండేపల్లి పోలీస్ స్టేషన్లో వేధిస్తున్నారని కేసు సైతం నమోదయింది. అంతటితో ఆగకుండా మహేందర్ పై ఆ యువతి కుటుంబ సభ్యులు వేధింపులకు దిగారు. నానా బూతులు తిడుతూ చంపుతామంటూ బెదిరించినట్లు వారు తెలిపారు. ఇది క్రమంలో మహేందర్ గురువారం సాయంత్రం తన పొలం వద్ద ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. తనకు బతకాలని ఉందని తనను బతికించాలని కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వారు తెలిపారు. ఈ మేరకు మృతుని తండ్రి గడి కొప్పల లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ పాల్ తెలిపారు.