తాడిచెర్ల బ్లాక్ లో 20వేల కోట్లు అవినీతి..

తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ఏమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ఢిల్లీ లిక్కర్ క్వీన్ అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డిలు ఆరోపించారు.

Update: 2023-03-12 12:42 GMT

దిశ, మందమర్రి : తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ఏమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ఢిల్లీ లిక్కర్ క్వీన్ అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డిలు ఆరోపించారు. ఆదివారం మందమర్రి దీపక్ నగర్ కు చెందిన యువకులు, తెలంగాణ జాగృతికి చెందిన మహిళలు బీజేపీలో చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వారుముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ పాలసీలో 25 శాతం ఉన్న వ్యాట్ ను ఒక్క శాతంగా తగ్గించి టీఎస్ సీఎం కేసీఆర్ తనయ ఏమ్మేల్సీ కవిత ఢిల్లీ ఆం ఆద్మీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.

లిక్కర్ పాలసీలో 35 రూపాయలు ఉన్న కమిషన్ ను 340 రూపాయలు పెంచుకున్నారని అన్నారు. ఏమ్మెల్సీ కవితకు చెందిన ఇండో స్పిరిట్ సంస్థ ద్వార 800 లిక్కర్ షాపులను స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. కేసీఆర్ మాయమాటలతో రాష్ట్ర ప్రజలు వేసారి పోయారని అన్నారు. రానున్న 6 నెలల్లో ముఖ్యమంత్రి పీఠం నుండి దించుడే అని జోష్యం చెప్పారు. సింగరేణిలో 51 శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రప్రభుత్వంను కాదని 49 శాతం ఉన్న కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేస్తుందని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వం పై నిందారోపణలు చేస్తూ సింగరేణి కార్మికులను నమ్మిస్తుందని మండిపడ్డారు. ఇకపోతే సిరులమారాణి సింగరేణిలో తాడిచర్ల మైనను కేసీఆర్ తన పెట్టుబడిదారులకు కట్టబెట్టాడని అన్నారు.

భూగర్భ గని ద్వారా సింగరేణి కార్మికులు 500 రూపాయలకు తీసే బొగ్గు ఖర్చును 3000 రూపాయలకు పెంచి ఏఎన్ఆర్ బడా పెట్టుబడి పారిశ్రామిక వేత్తల సంస్థలకు ఇచ్చి దాదాపు 20 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయిందని అన్నారు. తెలంగాణ ప్రజల బతుకులను ఆగంచేసి కేసీఆర్ కుటుంబం ఒక్కటే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. అనంతరం మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పలువురికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, మాజీ జెడ్పీటీసీ కోయ్యాల హేమాజీ, మందమర్రి బీజేపీ పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News