Addanki Dayakar: రాష్ట్రానికి పట్టిన దరిద్రం మోడీ.. అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

హైదారాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Update: 2025-04-14 11:02 GMT
Addanki Dayakar: రాష్ట్రానికి పట్టిన దరిద్రం మోడీ.. అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: హైదారాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అడువులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని సోమవారం హర్యానాలో జరిగిన ఓ సభలో ప్రధాని మోడీ (Narendra Modi) ప్రసంగించారు. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని కలిగించటం ఇదే కాంగ్రెస్ పాలన అని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) స్పందించారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. ఈ దేశాన్ని రెండుగా విడగొట్టేలా, ఏజెంటుగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఈ రాష్ట్రానికి పట్టిన ఓ దరిద్రంలా మోడీని చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అన్ని రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తితో ఉండాలన్నారు. బీజేపీ (BJP) పాలిత ప్రాంతాల్లో విధ్వంసం జరిగిన కామెంట్ చేయారని, ఉదాహరణకు మణిపూర్‌లో హింసాకాండ జరిగితే ఒక్క రోజైనా కామెంట్ చేశారా? అని నిలదీశారు. నియంతలా, ఫాసిస్టులా వ్యవహరిస్తున్నారని మోడీకి ప్రపంచం మొత్తంలో ప్రచారం ఉందని, అమెరికా వారి మోచేతి నీళ్లు తాగే ప్రయత్నం చేస్తారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో రాజ్యాంగ బద్ద కార్యక్రమాలు, రాజకీయాలు చేస్తుందన్నారు. నేడు తెలంగాణ కేంద్రంపై పోరాటం చేస్తున్నందుకే మోడీ ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు.

Tags:    

Similar News