Addanki Dayakar: రాష్ట్రంలో ఈడీ దాడులు బీజేపీ కుట్రే.. అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఈడీ (Enforcement Directorate) అధికారుల సోదాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

Update: 2024-09-27 09:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈడీ (Enforcement Directorate) అధికారుల సోదాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు వారు హైదరాబాద్‌ (Hyderabad)లోని నందగిరి హిల్స్‌లో ఉన్న మంత్రి నివాసం, హిమాయత్ సాగర్‌లోని ఫామ్‌ హౌజ్, పొంగులేటి కుమార్తె, బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం ఏక కాలంలో 16 చోట్ల సోదాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈడీ (ED) దాడులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) తీవ్ర స్థాయిలో స్పందించారు.

ఈడీ దాడులు ముమ్మాటికీ కేంద్రంలోని బీజేపీ కుట్రేనని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులను బీజేపీ భయపెట్టి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని పొలిటికల్‌గా టార్గెట్ చేసుకుని అధకారం ఉంది కాదా అని కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. గతంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఇలాగే ఈడీ, ఐటీ దాడులు చేయించారని గుర్తు చేశారు. అన్ని పర్యావసానాలకు బీజేపీ భవిష్యత్తులో భారీ మూల్యం చల్లించుకోక తప్పదని అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఫైర్ అయ్యారు. 


Similar News