విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్

శేరిలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీ 124 డివిజన్‌లో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాళ్లతో ఓ దుండగుడు పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2024-01-16 12:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : శేరిలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీ 124 డివిజన్‌లో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాళ్లతో ఓ దుండగుడు పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎంతో గౌరవం ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాని పేర్కొన్నారు.

Tags:    

Similar News