ACB Raids: హెచ్‌సీఏలో ఏసీబీ రెయిడ్స్.. పలు కీలక పత్రాలు, ఈ-మెయిల్స్ రికవరీ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ హాయాంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది.

Update: 2024-07-31 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ హాయాంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు తాజాగా హెచ్‌సీఏలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక ఫైళ్లు, దస్త్రాలు, ఈ-మెయిల్స్ అధికారులు రికవరీ చేశారు. జరిగిన అక్రమాల విషయంలో మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు, కార్యదర్శి హస్తంపై ప్రస్తుత సభ్యులను ఏసీబీ అధికారులు అడిగి తెలుసుకున్నారు.

కాగా, హెచ్‌సీఏలో నిధులు దుర్వినియోగం అయినట్లుగా 2023 అక్టోబరులో నాలుగు కేసులు ఉప్పల్‌లో నమోదయ్యాయి. 2019- 2022 మధ్య కాలంలో అపెక్స్‌ కౌన్సిల్‌ నేతృత్వంలో బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్స్, ఖర్చులు, టెండర్లు, కొటేషన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వెల్లడైంది. దీంతో 2019- 2022 మధ్య కాలంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్‌ మనోజ్, సెక్రటరీగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్‌ శర్మ, ట్రెజరర్‌గా సురేందర్‌ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ ఉన్నారు.

Tags:    

Similar News