ACB: రిమాండ్‌ విధించిన జడ్జి.. చంచల్‌గూడ జైలుకు నిఖేష్ తరలింపు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈఈ(Irrigation Department AEE) నిఖేశ్‌ కుమార్‌(Nikesh Kumar)‌ను తెలంగాణ ఏసీబీ అధికారులు(ACB officials) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-12-01 03:51 GMT
ACB: రిమాండ్‌ విధించిన జడ్జి.. చంచల్‌గూడ జైలుకు నిఖేష్ తరలింపు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈఈ(Irrigation Department AEE) నిఖేశ్‌ కుమార్‌(Nikesh Kumar)‌ను తెలంగాణ ఏసీబీ అధికారులు(ACB officials) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ సోదాల తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం నిఖేష్‌ను జడ్జి నివాసంలో హాజరు పరిచారు. ఈనెల 13వ తేదీ వరకు ఏసీబీ జడ్జి(ACB Judge) రిమాండ్ విధించారు. దీంతో నిఖేష్‌ను చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించనున్నారు. ఇదిలా ఉండగా.. నిఖేష్ ఇంటితో పాటు బంధువుల నివాసాలలో 25 నుంచి 30 చోట్ల సోదాలు జరిపిన అధికారులు.. దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూ నిఖేశ్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Tags:    

Similar News